విషయ సూచిక

సమతుల్యత

విషయ సూచిక

శత్రువు మెచ్చుకుంటే నే
అది అసలైన వ్యక్తిత్వం
సిద్ధాంతాలు వ్యతిరేకించే వాడు
శ్రద్ధగా వింటేనే గొప్ప ఉపన్యాసం
విపక్షాలు పొగిడితే నే
సరైన పరిపాలన
పదవుల కై విలువలు వదలకుంటే నే
నిజమైన నాయకుడు
నిన్ను అజాత శత్రువు చేసింది
మెతక తనం కాదు నైతిక విలువలు
నీవు అతివాదల్లో మితవాదివి
అనుట అర్థసత్యం
వాదలకంటే దేశ శ్రేయస్సు ముఖ్యమని
నమ్మకాలకన్న ప్రజా బాహుళ్యా
సహా జీవనం మిన్నయని
నమ్మిన రాజనీతిజ్ఞుడివి
నాయకులలో రాజకీయాలు తప్ప
రాజనీతి శూన్యం అయిన వేళా
నీవిప్పుడు ముచ్చటించు కోవడానికి
ఒక ఆదర్శం మాత్రమే-అటల్ జీ